calender_icon.png 30 July, 2025 | 8:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే తెల్లం వెంకటరావును సస్పెండ్ చేయాలి

29-07-2025 07:30:37 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): కులాల మధ్యన చిచ్చుపెడుతున్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు(MLA Tellam Venkat Rao) శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని బూర్గంపాడు మండల సేవలాల్ సేన అధ్యక్షులు గుగులోతు రాంబాబు నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సారపాకలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో అన్నాదమ్ములుగా కలిసిమెలిసి జీవిస్తున్న లంబాడ, కోయ సోదరుల మధ్య వర్గ విభేదాలు సృష్టిస్తున్నారని, ఎస్టీ జాబితాలో నుండి లంబాడీలను తొలగించాలని సుప్రీంకోర్టులో కేసు పెట్టిన విషయమై మండల కమిటీ తరపున తీవ్రంగా ఖండించారు.

అసెంబ్లీ ఎన్నికలలో లంబాడి ఓట్లతో గెలిచి గద్దెనేక్కి రెండు కులాల మధ్య చిచ్చుపెట్టి, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర మచ్చ తెస్తున్నారని, ఏజెన్సీ ప్రాంతాలను అభివృద్ధి చేయకుండా గిరిజనులను పక్కదోవ పటిస్తున్నారని ఆరోపించారు. ఇలానే వ్యవహరిస్తే రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పదు అని హెచ్చరించారు. వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి తెల్లం వెంకట్రావు ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన వ్యవస్థాపక ఉపాధ్యక్షులు అజ్మీర వెంకన్న నాయక్, బూర్గంపాడు మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్యా సురేష్ నాయక్, మండల యూత్ ప్రెసిడెంట్ తేజావత్ ప్రేమ్ కుమార్, సారపాక టౌన్ అధ్యక్షులు ఆంగోతు రఘు, సారపాక టౌన్ యూత్ ప్రెసిడెంట్ భూక్యా వినోద్ కుమార్, సారపాక టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గూగులోత్ శంకర్ పాల్గొన్నారు.