04-07-2025 01:05:45 AM
రాజేంద్రనగర్, జూలై 3: మైలార్ దేవ్ పల్లి కాటేదాన్ లో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాటేదాన్ పారిశ్రామిక వాడలో ని శివం రబ్బరు పరిశ్రమలో దట్టమైన పొగలతో మంటలు చెలరేగాయి. పరిశ్రమంలో రబ్బర్ సామాగ్రి ము డి సరుకు ఎక్కువగా ఉండడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు భయభ్రాంతులకు లోనై అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు.
ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పరిశ్రమలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరగడంతో పరిశ్రమలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పినట్లు అయింది. అగ్ని ప్రమాదంలో రూ.6 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు పరిశ్రమ యజమాని తెలిపారు. పరిశ్రమ యజమాని ఫిర్యాదు మేరకు ప్రమాదానికి గల కారణాల పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.