calender_icon.png 6 July, 2025 | 10:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏలేటి ఫోన్‌నూ ట్యాప్ చేశారు!

06-07-2025 12:11:16 AM

విచారణకు హాజరు కావాలని బీజేపీ శాసనసభాపక్ష నేతకు సిట్ నోటీసులు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5 (విజయక్రాంతి): రాష్ర్టవ్యాప్తంగా సంచలనం సృ ష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్  కేసులో భాగంగా సిట్ అధికారులు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు. మునుగోడు ఉపఎన్నికతో పాటు 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఫోన్ ను ట్యాప్ చేసినట్లు విచారణలో వెల్లడవడం తో, వాంగ్మూలం నమోదు కోసం శుక్రవా రం రాత్రి ఆయనకు నోటీసులు అందజేశా రు.

శనివారం విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నప్పటికీ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హాజరు కాలేదు. బీజేపీ రాష్ర్ట అధ్య క్షుడి పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉన్నందున శనివారం విచారణకు రాలేనని ఆయన సిట్ అధికారులకు సమాచారం పం పారు. దీంతో వచ్చే బుధవారం లేదా శుక్రవారం విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు ఏలేటికి సూచించారు.

618 ఫోన్లు ట్యాప్, 236 మంది వాంగ్మూలాల నమోదు

రాష్ట్రంలో మొత్తం 618 మంది ఫోన్లు ట్యాపింగ్‌కు గురైనట్లు సిట్ అధికారులు విచారణలో గుర్తించారు. వారిలో ఇప్పటికే 236 మందికి నోటీసులు జారీ చేసి, సాక్షులుగా వారి వాంగ్మూలాలను నమోదు చేశా రు. ఈ కేసులో మరిన్ని రాజకీయ, అధికారిక ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.