calender_icon.png 23 November, 2025 | 4:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భీమన్న ఆలయంలో భక్తుల రద్దీ

23-11-2025 04:45:25 PM

వేములవాడ టౌన్: వేములవాడ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం సెలవుదినం కావడంతో భక్తుల రద్దీ  పెరిగింది. స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకునేందుకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. స్వామివారి అభిషేకాలు, నిత్యకళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతాలు, కుంకుమపూజలు, అన్నపూజలు తదితర మొక్కులు భక్తులు అధికంగా చేయించుకున్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేసి భక్తుల దర్శనం సజావుగా కొనసాగేలా పర్యవేక్షిస్తున్నారు.

మధ్యాహ్నం 12:50 గంటల వరకు నమోదైన వివరాలు:

కోడె మొక్కులు. 2050

కళ్యాణాలు 48 సత్యనారాయణ స్వామి వ్రతాలు 3 అభిషేకాలు 43

అన్న పూజలు 24 కుంకుమ పూజ 13 స్వామివారి దర్శనం పొందిన భక్తుల సంఖ్య: 23,473

భక్తుల భక్తిశ్రద్ధతో భీమన్న ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది.