23-11-2025 04:50:49 PM
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) రాతపరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మూడు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 747 మంది అభ్యర్థులకు గాను 706 మంది పరీక్షకు హాజరైయారు. జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్‌రావు పరీక్ష కేంద్రాలను సందర్శించారు.