23-11-2025 04:46:30 PM
నకిరేకల్ (విజయక్రాంతి): నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పున్న కైలాష్ నేత నియమితులైన నేపథ్యంలో ఆయన ఆదివారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం, పున్న కైలాష్ నేతను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేయాలని సూచించారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రజలకు చేరువగా పని చేస్తానని పున్న కైలాష్ నేత తెలిపారు.