calender_icon.png 23 November, 2025 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్నూరు కాపు సంఘం యూత్ కమిటీ ఎన్నిక..

23-11-2025 04:43:30 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): మున్నూరు కాపు సంఘం పటిష్టత కోసం గ్రామస్థాయిలో నూతన కమిటీలు ఎన్నుకుంటున్నారు. ఇందులో భాగంగా బోరజ్ మండలంలోని గూడ గ్రామ యూత్ కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడుగా చిందం అనిల్, ప్రధాన కార్యదర్శి ప్యాలపు ప్రవీణ్ కుమార్ తో పాటు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని పలువురు సంఘం సభ్యులు ఘనంగా సన్మానించి, అభినందించారు. సంఘం బలోపేతానికి తమ వంతుగా కృషి చేస్తామని నూతన అధ్యక్ష కార్యదర్శులు పేర్కొన్నారు.