23-11-2025 04:49:37 PM
ఇందిరమ్మ చీరల పంపిణీ
జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలోని మాందాపూర్ గ్రామంలో ఆదివారం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా డ్వాక్రా మహిళా సంఘ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంతన్న కానుకగా గ్రామ మహిళా సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, ఐకేపీ సిబ్బంది పేద మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యకమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో కోటి మంది మహిళలకు చీరలు అందించడం మహిళల సాధికారతే లక్ష్యంగా, వారిని కోటీశ్వరులను చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆశయమని అదే దిశగా ప్రజాపాలన కోనసాగుతుందని ఆయన అన్నారు.
18 సం నిండిన ప్రతి ఆడపడుచుకు చీర అందనుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్ సర్వీస్, రేషన్ కార్డులు, ఉచిత రేషన్ సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు,మహిళా క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటు వంటి అనేక సంక్షేమ పథకాల్ని ప్రారంభించి మహిళల ఆర్ధికంగా ఎదగడానికి వారి అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం తోడ్పాటునందిస్తుందన్నారు. చీరల నాణ్యత విషయంలో రాజీ పడకుండా మహిళ మంత్రులు సీతక్క, సురేఖలు తయారీ పరిశీలించారన్నారు.
ఓకె రంగుతో నాణ్యతతో కూడిన చేనేత చీరలు అందించడం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు కోటి మహిళలకు చేనేత చీరలు అందించే ఉద్దేశంతో పథకాన్ని ప్రవేశపెట్టి చేనేత కార్మికులకు అండగా ప్రజా ప్రభుత్వం ఉందనడానికి ఇదే నిదర్శనమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రివర్గానికి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీకి ,పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు, ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రేవతి, అధ్యక్షుడు రాకేష్ రెడ్డి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, రోడ్డ రాజు,కాంగ్రెస్ నాయకులు రాజిరెడ్డి, శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి,నర్సింలు, ఐకేపీ ప్రతినిధులు లత,సుజాత,మౌనిక,వెంకట్ రాజ్ గౌడ్,స్వామి, విజయ తదితరులు పాల్గొన్నారు.