23-11-2025 05:03:59 PM
నకిరేకల్ (విజయక్రాంతి): ఈనెల 28న సూర్యాపేట పట్టణ కేంద్రంలో కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభ సందర్భంగా నిర్వహించే గీతన్న రణభేరి సభకు కల్లుగీత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆ సంఘం నకిరేకల్ మండల అధ్యక్షులు కొప్పుల అంజయ్య గౌడ్ మండల కార్యదర్శి గుడుగుంట్ల బుచ్చి రాములు గౌడ్ కోరారు. ఆదివారం నకిరేకల్ మండలంలోని తాటికల్లు గ్రామంలో ఈరోజు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈనెల 28వ తారీకు గీతన్న రణభేరి రాష్ట్ర మహాసభ వాల్ పోస్టర్లును విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు పోలేగోని వెంకన్న వెంకన్న ఉపాధ్యక్షులు జనగాని శ్రీను, కమిటీ సభ్యులు కొరివి కృష్ణ, చిన్నగాని బిక్షం, కారంగుల యాదయ్య, బండమీది ఇస్తారి, పోలేగోని మల్లయ్య, కాడింగుల శ్రీరాములు, కొండ లింగయ్య, కాలింగ్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.