calender_icon.png 23 November, 2025 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫేక్ కరెన్సీ ముఠాపై పోలీసుల ఉక్కుపాదం.. ముగ్గురు అరెస్ట్

23-11-2025 04:47:39 PM

కామారెడ్డి (విజయక్రాంతి): అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల ముఠా సభ్యుల్లో మరో ముగ్గురు సభ్యులను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదివారం వెల్లడించారు. నకిలీ నోట్ల ముఠా సభ్యుల్లో మరి కొంతమంది తప్పించుకొని తిరుగుతుండగా ఛత్తీస్ గఢ్ లో మరో ముగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరి వద్ద నుంచి ₹1,70,500 ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

అంతర్రాష్ట్ర ఫేక్ కరెన్సీ నోట్ల తయారీ ముఠా పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ కేసులో పోలీసులు గతంలో ఢిల్లీ, రాజస్థాన్, యూపీ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో గాలింపు చేపట్టి ఫేకు నోట్ల ముఠా లోని 8 మంది నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇందులో ప్రధాన నిందితుడు అయిన కరెన్సీ కాట్నీపై ఇటీవల పీడీ యాక్ట్ కూడా ప్రయోగించారు. తాజాగా ఈ ముఠాలోని మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.