29-07-2025 07:02:08 PM
తంగళ్ళపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District)లో తంగళ్ళపల్లి మండల కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ప్రకటన మేరకు తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిని, రాజన్న సిరిసిల్ల తంగళ్ళపల్లి మండలంలో ప్రాథమిక ఆసుపత్రి ఆవరణలో పరిసరాలు తిరుగుకుంటూ వచ్చే సీజన్లో ప్రజల ఆరోగ్యం మనకు ముఖ్యమని వారికి ఎటువంటి అనారోగ్యం కలగకుండా తగిన సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైద్యాధికారికి సూచించారు. అన్ని సదుపాయాలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని పరిశీలించారు. తంగళ్ళపల్లి ఇందిరమ్మ నగర్ గ్రామంలో డ్రై డే కార్యక్రమంలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఎలా ఉన్నాయో కార్యక్రమాలు ఎప్పటికప్పుడు పంపించాలని వారికి తగిన సదుపాయాలు ఎల్లవేళలా కల్పించాలని తెలియజేస్తూ ప్రజల ఆరోగ్యమే మనకు ముఖ్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో మలేరియా ప్రోగ్రాం అధికారి డాక్టర్ అనిత, సూపర్వైజర్ లింగం, ఆకస్మిక తనిఖీ చేసిన అధికారులు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.