calender_icon.png 27 December, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ ప్రజా ఉద్యమమే!

27-12-2025 03:08:28 AM

  1. ‘పాలమూరు-రంగారెడ్డి’పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో తీవ్ర అన్యాయమే
  2. సాగునీటిపై అసెంబ్లీ వేదికగా వివరిద్దాం 
  3. ద్రోహాన్ని ప్రజలకు చెబుదాం 
  4. తెలంగాణపై బీఆర్‌ఎస్‌కు తప్ప మరే పార్టీకి పట్టింపు ఉండదు
  5. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో జరిగిన కీలక సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ 
  6.  29న అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం? 
  7. అసెంబ్లీ సమావేశాల అనంతరం బహిరంగ సభలు 

హైదరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగనుందని, దీనిపై ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాన్ని నిర్మిద్దామని మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండకు చెందిన పార్టీ ము ఖ్య నాయకులతో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన తదుపరి కార్యాచరణపై ప్రధానంగా కేసీఆర్ చర్చించారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల విషయం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఈ అంశంపై అసెంబ్లీ వే దికగా గళం విప్పాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా 29న ప్రారంభమవుతున్న అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీంతోపాటు అసెం బ్లీ సమావేశాలు ముగియగానే పాలమూ రు, రంగారెడ్డి, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో భారీ బహిరంగ సభలను నిర్వహించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జరుగుతున్న అన్యాయాన్ని క్షేత్రస్థాయిలో రైతులకు, ప్రజలకు వివరించే లక్ష్యంతో బహిరంగ సభలకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు.

ఆ దిశగా ఈ సమావేశంలో నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తెలంగాణకు ద్రోహమే చేస్తున్నదని ఆగ్రహం వ్య క్తంచేశారు. తెలంగాణ కోసం బీఆర్‌ఎస్ తప్ప మరే ఇతర పార్టీకి పట్టింపు ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ సాగునీటి కల సాకారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టాల్సిందేనని ఈ సందర్భంగా కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలం గాణ నీటి హక్కులను పరిరక్షించుకునే బా ధ్యత బీఆర్‌ఎస్ పైనే ఉందని సూచించినట్టు సమాచారం. తెలంగాణకు జరుగుతు న్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా వివరిద్దామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ద్రోహం, అన్యాయాన్ని సభావేదికగా ప్రజలకు చెబుదామని నేతలకు వివరించారు. 

అసెంబ్లీకి కేసీఆర్?..

అసెంబ్లీ వేదికగా సాగునీటి ప్రాజెక్టులపై కీలకంగా చర్చించనున్న నేపథ్యంలో కేసీఆర్ కూడా సమావేశాలకు హాజరవుతారని తెలుస్తోంది. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేంద్ర, రాష్ట్ర అవలంభిస్తున్న తీరును ఎండగట్టాలని కేసీఆర్ పూనుకున్నట్టు సమాచారం. అందులో భాగంగానే తాజాగా పాలమూరు-రంగారెడ్డి ప్రభావిత జిల్లాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ అంశంపై పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలలోని గ్రామాలవారీగా నిరాహార దీక్షలు, నిరసన దీక్షలు చేపట్టాలని, మండలాలు, డివిజన్ కేంద్రాల్లో నిరసనలు, ఆందోళనలు నిర్వహించే దిశగా కేసీఆర్ రూట్ మ్యాప్ ఖరారుచేసినట్టు సమాచారం. పాలమూరు ప్రాజెక్టుపై ప్రత్యేక పాటలను సిద్ధం చేయాలని, సోషల్ మీడియాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జరిగిన అన్యాయాన్ని వివరించాలని, తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. 

బహిరంగ సభలు..

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు జాప్యం కారణంగా జరు గుతున్న అన్యాయాన్ని ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్ ప్రణాళికలు రూపొం దించింది. అందులో భాగంగా క్షేత్రస్థాయిలో రైతులను చైతన్య పర్చడానికి మూడు ఉమ్మడి జిల్లాల్లో మూడు భారీ బహిరంగ సభలను నిర్వహించాలని సమావేశంలో ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పరిగిలో ఒక సభను, నల్లగొండ జిల్లాలోని దేవరకొండ లేదా కొండమల్లేపల్లిలో రెండో సభను, పాలమూరు జిల్లాలో అత్యంత భారీస్థాయిలో మూడో సభను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

వాస్తవానికి జనవరిలో మొదటివారంలో బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణ యించినప్పటికీ అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో సమావేశం ముగిసిన వెంటనే బహిరంగ సభలను ప్రారంభించాలని కేసీఆర్ నేతలకు దిశా నిర్దేశం చేశారు. సంక్రాంతి పండుగ కంటే ముందే ఒక సభను నిర్వహించి, పండుగ తర్వాత మిగిలిన రెండు సభలను పూర్తి చేయాలా? లేక మూడు సభలను సంక్రాంతి తర్వాతే వరుసగా నిర్వహించాలా అనే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

ఈ మూడు సభలకు కేసీఆర్ స్వయంగా హాజరై ప్రసంగిం చడంతోపాటు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపనున్నారు. దీంతోపాటు రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టనున్నారు. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి హాజరయ్యారు.