27-12-2025 02:52:21 AM
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కేంద్రీకృతమైన అవినీతి
ఆదిలాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్రాన్ని గత పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం రెండేళ్లుగా పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానిది కరప్షన్ పాలన అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించా రు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే కేంద్రీకృతమైన అవినీతికి పాల్పడేదని, కానీ ప్రస్తుత కాం గ్రెస్ ప్రభుత్వంలో సీఎం నుంచి మొదలుకొని మంత్రుల వరకు అందరూ అవినీతికి పాల్పడుతూ వికేంద్రీకృతమైన అవినీతికి తెరలేపారని ధ్వజమెత్తారు.
అందుచేతనే ఈ అవినీతి పార్టీలను పాతరేసేందుకు ఆదిలాబాద్ నుంచే మార్పు మొదలు పెట్టాలని పిలుపునిచారు. శుక్రవారం ఆదిలాబాద్ జి ల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ బలపర్చగా, గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్లకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్ర మంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్‌తో కలిసి సర్పంచ్‌లను శాలువాతో సత్కరించి అభినందిం చారు.
అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశిం చి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని, కానీ ప్రత్యేక రాష్ట్రమేర్పడ్డాక బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాం లో తెలంగాణ పరిస్థితి అంధకారంగా మారిందన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే రాష్ట్ర పరిస్థితి బాగుపడుతోందన్నారు. అందుకోసం అసెంబ్లీ లో బీజేపీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణగా మారుస్తా మన్న కేసీఆర్ తన కుటుంబాన్ని మాత్రమే బంగారు కుటుంబంగా మార్చుకున్నారని, రాష్ట్రాన్ని మాత్రం అప్పుల ఊబిలోకి నెట్టేశారని మండిపడ్డారు.
దీంతోనే కేసీఆర్‌ను ప్రజలు ఫామ్ హౌస్‌కే పరిమితం చేశారని పేర్కొన్నారు. పదేళ్లపాటు తెలంగాణ ప్రజలను బానిసలుగా మార్చి, అవినీతి ద్వారా డబ్బులను దోచుకున్నారన్నారు. ఆ డబ్బుల కోసం కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇప్పుడు రోడ్డున పడ్డారని ఆరోపించారు. నీతికి, నిజాయితీకి, అభివృద్ధికి ప్రతిరూపం ఆనాటి ప్రధాని అటల్ బిహార్ వాజ్‌పేయి అని ఆయన అడుగుజాడల్లో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కొనసాగుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్, ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.