29-07-2025 07:06:20 PM
బెజ్జూర్ (విజయక్రాంతి): బెజ్జూర్ మండల(Bejjur Mandal) కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో భక్తి శ్రద్ధలతో నాగుల పంచమిని ప్రజలు జరుపుకున్నారు. తెల్లవారుజామునే ఆలయాలకు, నాగదేవత విగ్రహాల వద్దకు చేరుకొని పాలాభిషేకం నిర్వహించి, నైవేద్యాలు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. శివాలయంలో భక్తులు అర్చకులు గురుదత్ ఆధ్వర్యంలో అభిషేకం, అర్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.