calender_icon.png 10 January, 2026 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అహం తగ్గించుకొని మాట్లాడు

08-01-2026 12:29:13 AM

కరింనగర్ క్రైం, జనవరి 7(విజయక్రాంతి): రాహుల్ గాంధీని,సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉరితీయాల్సింది రాహుల్ గాంధీని కాదని, మానేరు ఇసుకను పందికొక్కులా తిని వేలకోట్లు సంపాదించిన కేటీఆర్ నే మానేరు నది ఒడ్డుకు ఉరితీయాలని నరేందర్ రెడ్డి అన్నారు. నేరెళ్ల దళిత బిడ్డలను కేటీఆర్ ఇసుక లారీలతో గుద్దించారని, తెలంగాణ సంపదను చెరపట్టారని అందుకే కేటీఆర్ నే ఉరితీయాలని ఆయన అన్నారు..రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని, విమర్శించే స్థాయి కేటీఆర్ కు ఉందా అని ప్రశ్నించారు..

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన జరుగుతుంటే చూసి ఓర్వలేక కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని నరేందర్ రెడ్డి మండిపడ్డారు  కేటీఆర్, కెసిఆర్ కుటుంబ బండారాన్ని,వేలకోట్ల అవినీతి సామ్రాజ్యాన్ని ఆ ఇంటి ఆడబిడ్డ కల్వకుంట్ల కవితనే బయట పెడుతోందని నరేందర్ రెడ్డి అన్నారు.కల్వకుంట్ల కవిత ఆరోపణలకు సమాధానం చెప్పకుండా కేటీఆర్ మతితప్పి మాట్లాడుతున్నారని అన్నారు.

పదేళ్ల పాలనలో ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ లు ఇల్లు ఇవ్వలేదని, హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయలేదని,అలాంటి కేటీఆర్ తమను విమర్శిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు దగ్గర పెట్టుకోకపోతే కేటీఆర్ కు గుణపాఠం చెప్తామని,ఎక్కడ దొరికితే అక్కడ ఉరికిచ్చి కొడతామని, కాంగ్రెస్ కార్యకర్తల దెబ్బల రుచి చూడాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు..అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాలని ప్రజలు కేసీఆర్ ను గెలిపిస్తే, జీతం తీసుకుని ఫామ్ హౌస్ లో పడుకుంటున్నారని, అందుకేనా జనం గెలిపించింది అని ఏద్దేవా చేశారు. అసలు కేకే మహేందర్ రెడ్డి సీటును సిరిసిల్లలో కేటీఆర్ లాక్కొని అత్తెసరు మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యే అయ్యాడని, అలాంటి కేటీఆర్ కు రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత లేదని అన్నారు.. ఇంకోసారి ఇలాగే మాట్లాడితే కేటీఆర్ కు తగిన గుణపాఠం చెప్తామని తెలిపారు హెచ్చరించారు.