14-12-2025 04:47:13 PM
నాగిరెడ్డిపేట్ (విజయక్రాంతి): ఓటర్లు ఎలాంటి భయాందోళన చెందకుండా నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ విట్టల్ సూచించారు. ఆదివారం మండలంలో జరుగుతున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలంలోని జలాల్పూర్, తాండూర్,నాగిరెడ్డిపేట,మాల్ తుమ్మెద,బొల్లారం గ్రామాలలో ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియ సక్రమంగా పర్యవేక్షించాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో భద్రత ఏర్పాట్లు, పోలింగ్ సిబ్బంది విధులు, ఓటరు కల్పించడం సౌకర్యాలపై వారు అధికారులతో సమీక్షించారు.
ఇలాంటి ఆలోచనలు సంఘటనలు చోటుచేసుకుండా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసు అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియలు పూర్తయి ఫలితాల వెల్లడి ముగిసే వరకు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని భద్రత చర్యలు కొనసాగించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్,తాసిల్దార్ శ్రీనివాసరావు,ఇన్చార్జి ఎంపీడీవో ప్రవీణ్ కుమార్,డిప్యూటీ ఎమ్మార్వో రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.