calender_icon.png 15 December, 2025 | 10:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజేతలు వీరే..

14-12-2025 11:07:44 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో రెండో విడతగా జరిగిన ఎన్నికలు ఆదివారం ముగిశాయి. అనంతరం మధ్యాహ్నం ఓట్ల కౌంటింగ్ చేపట్టారు. బెల్లంపల్లి మండలంలో 17 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 2, స్వతంత్రులు 3 స్థానాల చొప్పున కైవసం చేసుకున్నాయి. కౌంటింగ్ రాత్రి 10 గంటల వరకు సాగింది. ఎన్నికల అధికారులు ప్రకటించిన ఫలితాలు ఇలా ఉన్నాయి.

బెల్లంపల్లి మండలంలోని అకెనపల్లి సుధామల వెంకటి(కాంగ్రెస్), అంకుశం బొంతల అరుణ(బీఆర్ఎస్), బట్వాన్పల్లి సంగతి రాజేష్(కాంగ్రెస్), బుచ్చయ్యపల్లి, జాడి మహేశ్వర్(కాంగ్రెస్), బుధాకలాన్ దాడి నగేష్(ఇండిపెండెంట్), భూదకుర్దు వెంబడి రాణి(కాంగ్రెస్), చాకపల్లి జమ్మి మౌనిక (ఇండిపెండెంట్), చంద్రవెల్లి, చిలుముల శ్రీనివాస్(కాంగ్రెస్) దుగ్నపల్లి జుమ్మడి లలిత (కాంగ్రెస్), మాల గురజాల పెద్ద బోయిన శ్యామలత(కాంగ్రెస్ రెబల్), కన్నాల నాతరి మల్లమ్మ(కాంగ్రెస్), లంబాడితండా సాగర్ల లక్ష్మణ్(కాంగ్రెస్), లింగాపూర్ దొంగలు నర్మద(కాంగ్రెస్), గురిజాల వంగ రామన్న గౌడ్(కాంగ్రెస్), పాత బెల్లంపల్లి పెట్టెం లక్ష్మి(కాంగ్రెస్), పేర్కపల్లి జరుకుల సాయి కృష్ణ(కాంగ్రెస్) గెలుపొందారు.