calender_icon.png 15 December, 2025 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూనంనేని ఇలాకాలో ఎర్రదండు విజయఢంకా

14-12-2025 10:04:16 PM

రెండు మండలాల్లో భారీగా సర్పంచ్ స్థానాలు కైవసం

వార్డుల్లోనూ కొనసాగిన విజయ పరంపర

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కూనంనేని సాంబశివరావు ఇలాకాలో ఎర్రదండు విజయఢంకా మోగించింది. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గంలోని చుంచుపల్లి, పాల్వంచ మండలాల్లో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. చుంచుపల్లి మండలంలోని విద్యానగర్ గ్రామపంచాయితీ సర్పంచిగా శాంతి శ్రీ ఏకగ్రీవంగా కాగా, 4 ఇంక్లైన్ సర్పంచిగా అజ్మీరా సింధు, బాబుక్యాంపు సర్పంచ్ నూనావత్ కుమారి, గౌతంపూర్ సర్పంచిగా నపావత్ కళ్యాణి, పెనుబల్లి సర్పంచిగా రెడ్డి సుజాత, పెనగడప సర్పంచిగా కారం సీతారాములు, రామాంజనేయ కాలనీ సర్పంచ్ గా తాగోరి సరిత, ప్రశాంతినగర్ సర్పంచిగా వాడే రాములు సమీప అభ్యర్థులుపై భారీ విజయం సాధించారు.

అదే విధంగా పాల్వంచ మండలంలో 4 నర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా రేగులుగూడెం సర్పంచిగా కుర్సం రాములు, మందెరకలపాడు సర్పంచిగా బాణోత్ లక్ష్మీ, కారెగట్టు సర్పంచ్గా వట్టం బాబూరావు, పునుకుల నర్పంచ్గా వజ్జా కృష్ణవేణి, ప్రబాత్ నగర్ సర్పంచిగా బోజన్ నిషారాణి, లక్ష్మీ దేవివల్లి ఎన్ సర్పంచిగా భూక్యా మంజుల, నాగారం కాలనీ సర్పంచ్ తేజావత్ వినోద్ కుమార్, దంతెలబోర ఎస్సి కాలనీ నర్పంచ్ గా సోదె వెంకట రమణలు 9 స్థానాల్లో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో పెద్దఎత్తున సంబురాలు జరుగుతున్నాయి. సిపిఐ శ్రేణులు ఎర్రజెండాలతో ర్యాలీలు నిర్వహించారు. 

ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన ఎర్రసైన్యం:

గ్రామ పంచాయితీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో ఒంటరి పోరుకు సిద్దపడ్డ సిపిఐ అవాకులు చెవాకులు పేలిన వారికి చుక్కలు చూపించింది. పోటీ చేసిన ప్రతీ స్థానంలో అగ్రభాగన నిలిచింది. డబ్బు, మధ్యం ఎరవేసి ఓటర్లను ప్రలోబాలకు గురిచేసేందుకు ప్రత్యర్ధులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు వన్నినా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సారధ్యం, జిల్లా కార్యదర్శి ఎన్కే సాబీర్ పాషా నేతృత్వంలో నియోజకర్గంలో తిరుగులేని శక్తిగా నిలిచింది. కమ్యూనిస్టులదేముందిలే అంటూ నోళ్లు పారేసుకున్న వారి నోళ్లు వెల్లబెట్టేలా దిమ్మతిరిగే సమాధానం చెప్పింది.