14-12-2025 04:20:57 PM
జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న రెండవవిడత సర్పంచ్ ఎన్నికలు
ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సిబ్బందికి ఆదేశాలు
నారాయణపేట (విజయక్రాంతి): నారాయణపేట జిల్లా పరిధిలో జరుగుతున్న రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్ మండలాలలో ఎన్నికల పోలింగ్ సరళి, పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్త్ ఏర్పాట్లను ఎస్పీ డాక్టర్ వినీత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ సమస్యత్మక పోలింగ్ కేంద్రాలైన జాజాపూర్, అప్పక్పల్లి, కోటకొండ, కొండాపూర్, కిష్టాపూర్, గోటూర్, మరికల్, ధన్వాడ తదితర పోలింగ్ కేంద్రాలను స్వయంగా పరిశీలించి పోలింగ్ సరళి, పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణం సర్పంచ్ ఎన్నికలు కొనసాగేలా చూడాలని తెలిపారు.
అలాగే పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఓటు వేయడానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, క్యూ లైన్ లో ఉండేలా చూడాలని ఆయన తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు పోలీస్ విభాగం హై అలర్ట్‌లో కొనసాగాలని, శాంతి–భద్రతలను కాపాడడంలో ప్రతి పోలీసు సిబ్బంది బాధ్యతగా ఉండాలని తెలిపారు నాల్గు మండలలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని అనంతరం పోలింగ్ కౌంటింగ్ సమయం లో అత్యంత అప్రమత్తంగా ఉండి కట్టుదితమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలీసు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పోలింగ్ కౌంటింగ్ సమయంలో ప్రజలు పోలీసు వారికి సహకరించాలని ఎస్పీ కోరారు.