calender_icon.png 4 January, 2026 | 3:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెహికిల్ పార్కింగ్ షెడ్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ

03-01-2026 12:05:09 AM

కామారెడ్డి, జనవరి 2,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలోని  వాహన విభాగంలో నూతనంగా వాహనాల పార్కింగ్ షెడ్డును నిర్మించారు. ఈ మేరకు ఎస్పీ రాజేష్ చంద్ర ఈ షెడ్‌కు శుక్రవారం ప్రారంభోత్సవం చేశారు.

సమర్ధవంతంగా సేవలు..

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్న పోలీస్ వాహనాలు ఎల్లవేళలా సిద్ధంగా ఉండేలా, క్రమబద్ధంగా నిలిపి ఉంచేలా ఈ షెడ్‌ను నిర్మించినట్లు ఎస్పీ తెలిపారు. అలాగే వర్షం, ఎండ వంటి వాతావరణ ప్రభావాలకు లోనుకాకుండా పోలీస్ వాహనాలు భద్రంగా ఉండే విధంగా ఈ షెడ్డును నిర్మించినట్లు పేర్కొన్నారు. పోలీస్‌శాఖ సమర్ధవంతంగా సేవలందించే విషయంలో వాహనాల భద్రత కూడా ముఖ్యమని ఎస్పీ పేర్కొన్నారు.

అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధంగా..

అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ వాహనాలు తక్షణమే అందుబాటులో ఉండడం చాలా ముఖ్యమని, అందుకే వాహనాలు నిలిపే సముదాయ షెడ్డు నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, మోటార్  ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.