calender_icon.png 14 December, 2025 | 11:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

14-12-2025 04:17:45 PM

కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించిన మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి

నాగిరెడ్డిపేట్ (విజయక్రాంతి): రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో నూతనంగా ఏర్పాటైన చిన్న ఆత్మకూర్, కన్నారెడ్డి గ్రామ పంచాయతీలలో ఆదివారం పోలింగ్ శాంతియుతంగా ప్రారంభమైంది. చిన్న ఆత్మకూర్ గ్రామ పంచాయతీలోని నాలుగో వార్డుకు చెందిన పోలింగ్ బూత్‌లో మాజీ జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి మొదటగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన సతీమణి పవిత్ర,కుమారులు సచిత్ రెడ్డి, నిచిత్ రెడ్డి కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించారు.

ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ… చిన్న ఆత్మకూర్ గ్రామంలో నాలుగో వార్డులో మొత్తం 74 ఓట్లు ఉన్నాయని, lవందకు వంద శాతం పోలింగ్ జరిగేలా ప్రతి ఓటరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, ఎన్నికల ద్వారా సరైన ప్రతినిధులను ఎన్నుకుంటేనే పల్లెల అభివృద్ధి సాధ్యమవుతుందని  తెలిపారు.పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టగా, ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు, అలాగే నాగిరెడ్డిపేట గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రామ మాజీ సర్పంచ్ భారత్ గ్యాస్ ప్రోప్రేటర్ విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకున్నారు.