3 June, 2026 | 1:48 AM

బి.ఎస్పీ కార్యాలయంలో ఆయుర్వేద దినోత్సవంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ

03-06-2026 12:00 AM

కలెక్టర్ ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

నిర్మల్ జూన్ 2 ( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకు న్నారు. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా అదన కలెక్టర్ కిషోర్ కుమార్ జెండాను ఎగరవేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మిల జెండా ఎగురవేగా డిఎఫ్‌ఓ కార్యాలయంలో డిఎఫ్ డి సుఖదేవ్ జెండా ఆవిష్కరించారు.

జిల్లా పరిషత్ కార్యాలయంలో స్థానిక సంస్థల అదన కలెక్టర్ బి వెంకటేశ్వర్లు పథకాన్ని ఆవిష్కరించారు. జెండా ఎగురవేసిన వారిలో డిఆర్‌ఓ రాథోడ్ రమేష్ గిరిజన సంక్షేమ శాఖ అధికారి అంబాజీనాయక్ భోజన్న ఆర్డబ్ల్యూసీ సందీప్ కుమార్ అధికారులు సిబ్బంది ఉన్నారు.