calender_icon.png 30 August, 2025 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దిగులు చెందకండి, ప్రభుత్వం నుంచి సహాయం పొందేలా చర్యలు చేపడతాం

29-08-2025 09:22:21 PM

భారీ వరదలకు నష్టపోయిన ప్రజలను పరామర్శించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): గత మూడు రోజుల క్రితం వరుసగా కురిసిన భారీ వర్షాలకు ఎల్లారెడ్డి మండలంలోని అన్నాసాగర్ కళ్యాణి బొగ్గు గుడిస అన్నసాగర్ తాండ గ్రామాలలో వరద ఉద్రిక్తంగా ప్రవహించి చాలామంది రైతులకు బొగ్గు గుడిసె ప్రాంతంలో ఉన్న నివాసపు ఇల్లు కూడా కొట్టుకపోవడంతో శుక్రవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ నేరుగా వరద ఉధృతకు నష్టపోయిన వారి కుటుంబాలను పరిశీలించారు.

వరద బాధితులకు ప్రభుత్వం నుండి సహాయమందే విధంగా చర్యలు చేపడతామని క్షేత్రస్థాయిలో నష్టపోయిన రైతులకు ప్రజల పట్ల అధికారులు పంట ఇతర ఇండ్లు ఇంకివైన నష్టపోయిన వాటి గురించి పూర్తిస్థాయిలో సర్వేలు చేసి నివేదికలు అందజేస్తారని, నష్టపోయిన రైతులకు ప్రజలకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అంది విధంగా కచ్చితంగా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే మదన్మోహన్ అన్నారు.