calender_icon.png 30 August, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటమునిగిన పంటలు.. నేలకొరిగిన చెట్లు

29-08-2025 09:59:03 PM

కోతకు గురైన రహదారులు.. దెబ్బతిన్న చెక్ డ్యామ్ లు

పరిశీలించిన అధికారులు

సదాశివనగర్,(విజయక్రాంతి): మండలంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో భారీ నష్టాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన పంటలను వరద నీరు ముంచెత్తింది. వాగులు ఉప్పొంగడంతో రహదారులు తెగిపోయి వంతెనలు దెబ్బతిన్నాయి. పలు గ్రామాల రాకపోకలకు నిలిచాయి.ఇండ్లు కూలాయి. చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్‌ లైన్లపై పడడంతో కరెంటు సరఫరాలో అంతరాయం కలిగింది. వర్షం కారణంగా పొలాల్లో వరద నీరు ప్రవహించడంతో పంటలు నేలకొరిగాయి.

వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం వివరాలను సేకరిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు తీసుకుంటున్నారు. మండలంలోని అమర్లబండ, తుక్కోజీవాడి, తిమ్మాజీవాడి,ధర్మరావ్ పేట్, వజ్జెపల్లి తండాలో భారీ వర్షం వలన దెబ్బ తిన్న రోడ్ల ను, ఇండ్ల ను  వరదకు గురై తరచంద్ కుంట పూర్తిగా తెగి దాదాపు  వందల ఎకరాలు ఎకరాల వరి పొలాలు, మొక్కజొన్న, పత్తి, సొయా పంటలు దెబ్బతిన్నాయి. శుక్రవారం వర్షం తగ్గడంతో అధికారులు నష్ట పోయిన పంటలను, కూలిన ఇండ్లు, తెగి పోయిన కుంటను ఇరిగేషన్ అధికారులతో కలిసి స్థానిక నాయకులు పరిశీలించారు.

వజ్జపల్లి తండాలో ఎగువన కురసిన భారీ వర్షాలకు కుంటలో పెద్ద మొత్తంలో వరదనీరు చేరడంతో కుంట మధ్య నుంచి పూర్తిగా తెగిపోవడం జరిగిందని తెలిపారు. వరద నీరుతో కింది భాగంలో ఉన్న పంట పొలాలు దాదాపు వందల ఎకరాలు నష్టపోవడం జరిగిందని అన్నారు. గ్రామ శివారులో గల తరచంద్ కుంటను అధికారుల సమక్షంలో స్థానిక నాయకులు ఎమ్మెల్యేను సంప్రదించగా ఆయన సానుకూలంగా స్పందించి తెగిపోయిన కుంటను నిర్మాణం చేపడతామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు.