29-08-2025 09:54:07 PM
సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా సంస్థాన్ నారాయణపురం మండలంలోని మోడల్ స్కూల్ విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది. నేషనల్ స్పోర్ట్స్ డే ఆకృతిలో విద్యార్థులు అద్భుత ప్రదర్శన నిర్వహించారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ దీపా జోషి మాట్లాడుతూ... క్రీడలు మానసికోల్లాసానికి దోహద పడతాయని చదువుతోపాటు క్రీడల్లో మంచి నైపుణ్యం సాధించాలని అన్నారు. భారతదేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన ధ్యాన్ చంద్ జీవితం రేపటి భావితరాలకు ఆదర్శనీయమన్నారు. శాంతియుత సమాజాన్ని నెలకొల్పడానికి యువత క్రీడల వైపు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.