calender_icon.png 29 August, 2025 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓరియంట్ ఎన్నికల్లో సత్యపాల్ రావు విజయం

29-08-2025 09:18:08 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీలో శుక్రవారం నిర్వహించిన కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో ఓరియంట్ సిమెంట్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (తరాజు గుర్తు) అభ్యర్థి కొక్కిరాల సత్యపాల్ రావు, తన సమీప లోకల్ ఓరియంట్ సిమెంట్ ఎంప్లాయ్మెంట్ వర్కర్స్ యూనియన్ (పెద్ద పులి గుర్తు) అభ్యర్థి పుస్కూరి విక్రమ్ రావు పై 33 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కంపెనీలో మొత్తం 257 రెగ్యులర్  కార్మికులతో పాటు 9 మంది ట్రైనీ కార్మికుల తో కలిపి 266 మంది ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉండగా 265 మంది పోలింగ్ లో పాల్గొని ఓటు వేశారు. 9 మంది ట్రైనీ కార్మికులు  సీల్డ్ కవర్ విధానంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటింగ్ పూర్తయ్యే సమయానికి తరాజు గుర్తు అభ్యర్థికి 141 ఓట్లు రాగా, పెద్దపులి గుర్తు అభ్యర్థి విక్రమ్ రావు కు 108 ఓట్లు వచ్చాయి. దీంతో 33 ఓట్ల మెజార్టీతో తరాజు గుర్తు అభ్యర్థి కొక్కిరాల సత్యపాల్ రావు విజయం సాధించారు. తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన కార్మికులకు అండగా ఉంటానని సత్యపాల్ రావు తెలిపారు. ఎన్నికల్లో ఓరియంట్ సిమెంటు పర్మినెంట్ వర్కర్స్ లోకల్ యూనియన్ (చక్రం గుర్తు) అభ్యర్థి తాట్ర భీమ్ రావు 6 ఓట్లు సాధించగా, మరొక అభ్యర్థి ఒకే ఓటుతో సరిపెట్టుకున్నారు. పోలైన 265 ఓట్లలో ఒకటి చెల్లని ఓటుగా గుర్తించినట్టు పోలింగ్ అధికారులు తెలిపారు.