calender_icon.png 30 August, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతికి కారణమైన వ్యక్తికి జైలు శిక్ష

29-08-2025 10:21:03 PM

మెట్ పల్లి సిఐఅనిల్ కుమార్

మెట్ పల్లి,(విజయక్రాంతి): నిర్లక్ష్యంగా వాహనం నడిపి వ్యక్తి మృతికి కారణమైన ఘటనలో నిందితునికి పది నెలల జైలు శిక్ష విధిస్తూ మెట్‌పల్లి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎం. అరుణ్ కుమార్ తీర్పు వెలువరించినట్లు మెట్ పల్లి సిఐ అనిల్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రాజుల సాయన్న అనే ఆటో డ్రైవర్ ఫిబ్రవరి 25 తేది 2020న మెట్‌పల్లి మండలం మేడిపల్లి గ్రామానికి కిరాయికి వెళ్లి తన ఆటోను రోడ్డు పక్కన నిలిపాడు.

అదే సమయంలో నిజామాబాద్ జిల్లా ముప్కల్ గ్రామానికి చెందిన ఆర్టిసి కండక్టర్ దుంపటి లక్ష్మీ రాజ్యం తన స్విఫ్ట్ డిజైర్ టిఎస్16 ఈఎస్1403 కారును అతివేగంగా, అజాగ్రత్తగా నడిపి పార్క్ చేసిన ఆటోను వెనుక నుండి బలంగా ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో రాజుల సాయన్న తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దర్యాప్తులోభాగంగా అప్పటి ఇబ్రహీంపట్నం ఎస్సై ఎం. అశోక్ కుమార్ కేసు నమోదు చేయగా, మెట్‌పల్లి సీఐ ఎల్. శ్రీను పకడ్బందీగా విచారణ జరిపి, నిందితుని కి  వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఆధారాలను పరిశీలించిన అనంతరం మెజిస్ట్రేట్ ఎం. అరుణ్ కుమార్ నిందితుడికి పది నెలల జైలు శిక్ష విధించారని సిఐ పేర్కొన్నారు.