29-08-2025 10:16:12 PM
పోచారం ప్రాజెక్టును కాపాడడానికి కృషి చేసిన నీటిపారుదల శాఖ అధికారులకు పోలీస్ శాఖకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు
పోచారం ప్రాజెక్టు వద్ద మరమ్మత్తు పనులు చేపట్టిన అధికారులు
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ నాగిరెడ్డిపేట్ మండలంలోని 107 సంవత్సరాల చరిత్ర కలిగిన పోచారం ప్రాజెక్టును సందర్శించారు. ఇటీవల 1.83 లక్షల క్యూసెక్కుల వరదనీటిని ఎదుర్కొన్న ఈ ప్రాజెక్టు గత నాలుగు రాత్రులుగా అత్యంత ప్రమాదకర పరిస్థితిలోకి చేరింది. ముఖ్యంగా ఆనకట్ట ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది. పోచారం ప్రాజెక్టు కేవలం 70 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంది.
ఈ సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొనడంలో మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఎమ్మెల్యే మదన్ మోహన్ కీలక పాత్ర పోషించారు. గత రాత్రి ప్రాజెక్టును రక్షించేందుకు 800 ఇసుక బస్తాలు నింపి ఆనకట్ట వద్ద వేయడం జరిగింది. ప్రాజెక్టుపై ఉన్న ఒత్తిడి తగ్గించేందుకు మదన్ మోహన్ తక్షణమే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని సంప్రదించగా, వారు వెంటనే నిజాం సాగర్ గేట్లను ఎత్తించాలని ఆదేశించి స్పందించారు.
ఈ సందర్భంగా మదన్ మోహన్ ముఖ్యంగా చీఫ్ ఇంజనీర్, డి ఈ ఈ, ఆర్డీవో పార్థసింహారెడ్డి, డి.ఎస్.పి శ్రీనివాసరావు, ఎస్డిఆర్ఎఫ్ బృందాలకు, ఎమ్మెల్యే మదన్మోహన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అధికారులందరూ రాత్రి అంతా ప్రాజెక్టు వద్ద ఉండి పరిస్థితిని సమర్థంగా నిర్వహించారు. అలాగే నాగిరెడ్డిపేట్ మండలంలోని కాంగ్రెస్ నాయకులు, పోచారం గ్రామ ప్రజలు అధికారులకు సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఏ పరిస్థితిలోనైనా అండగా ఉంటాను” అని హామీ ఇచ్చారు. రేపు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో వరదల కారణంగా నష్టపోయిన ప్రజల సమస్యలు, పంట నష్టపోయిన రైతుల సమస్యలు ప్రస్తావిస్తానని తెలిపారు. ప్రభుత్వం తరఫున ప్రత్యేక ఉపశమన ప్యాకేజీని డిమాండ్ చేస్తానని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఎల్లారెడ్డి ప్రజల డిమాండ్లను చేరుస్తానని హామీ ఇచ్చారు.