calender_icon.png 30 August, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లద్నాపూర్ 283 ఆర్ అండ్ ఆర్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి

29-08-2025 10:06:42 PM

సింగరేణి సి అండ్ ఎండితో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

రామగిరి,(విజయక్రాంతి): లద్నాపూర్ 283 ఆర్ అండ్ ఆర్  భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని  రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సింగరేణి సీఅండ్ ఎండీ  బలరాం నాయక్ ను కోరారు. రామగిరి మండలం లద్నపూర్ గ్రామాన్ని ఆర్జి 3 ఓసిపి టు విస్తరణలో భాగంగా  గ్రామాన్ని తీసుకోవడం జరిగిందని,  కానీ 283 ఆర్ అండ్ ఆర్ ఇంకా పూర్తి చేయకుండా గ్రామస్తులను ఇబ్బందులు గురి చేస్తున్నారని, వారి ఇబ్బందులు తొలగిపోవాలని మంత్రి శ్రీధర్ బాబుకు  గ్రామస్తులు శుక్రవారం మొరపెట్టుకున్నారు. 

 లద్నాపూర్ గ్రామానికి సంబంధించిన 283 ఆర్ అండ్ ఆర్  సమస్య గురించి ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును లద్నాపూర్ గ్రామా భూ నిర్వాసితులు కలిసి ప్యాకేజీ ఇప్పించాలని కోరుగ సింగరేణి సీ అండ్ ఎండికి ఫోన్ చేసి వారం రోజులలో ఈ సమస్య పరిష్కారం చేయాలన్నారు.  మంథని ఆర్డీవో  కి బిట్టుపల్లి సమీపంలో లద్నాపూర్ గ్రామానికి చెందిన ప్లాట్ల కు సంబంధించిన పని మొదలు పెట్టాలని సూచించారు.