02-12-2025 06:40:20 PM
సైబర్ మోసాలకు పూర్తి విరామం
పోలీసులు మాత్రమే రక్షకులు కాదు.. అవగాహన కలిగిన ప్రతి పౌరుడు కూడా రక్షకుడే..
వనపర్తి క్రైమ్: సైబర్ మోసాల నివారణ కోసం విద్యార్థులతో ‘సైబర్ భద్రత ప్రతిజ్ఞ’ చేయించిన ఎస్పీ. పోలీసు, ప్రజా, విద్యార్థుల భాగస్వామ్యంతో సైబర్ నేరాల రూపుమాపే దిశగా 6 వారాల విశాల ప్రచారం ధైర్యంగా ‘నో ’ చెప్పగలిగిన విద్యార్థి, ఎలాంటి సైబర్ దాడినైనా ఎదుర్కోగలడు. సైబర్ భద్రత అనేది ప్రభుత్వం–పోలీసులు–ప్రజల అందరి భాగస్వామ్యం. అందరరం కలిసి కట్టుగా సైబర్ నేరాలు డిజిటల్ తెలంగాణను రక్షిద్దామని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి ఐపీఎస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్ బి) ప్రజల్లో సైబర్ భద్రతపై పెద్దఎత్తున అవగాహన సృష్టించేందుకు “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” పేరుతో ప్రత్యేక 6 వారాల ప్రచార కార్యక్రమాన్ని 02 డిసెంబర్ 2025 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది.
ఈ కార్యక్రమం రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఐపీఎస్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీపీ షికా గోయల్ ఐపీఎస్ సీనియర్ అధికారుల సమక్షంలో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని టీజిఐసీసీసీ ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభమైయింది. ఈ కార్యక్రమాన్ని వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ భవనంలో ప్రభుత్వ వైద్య కళాశాల, పాలిటెక్నీక్ కళాశాల, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, బాలుర జూనియర్ కళాశాల, విద్యార్థినీ విద్యార్థులతో ఏర్పాటు చేసిన “ఫ్రాడ్ క ఫుల్ స్టాప్”సైబర్ అవగాహన ప్రచారాన్ని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి, ఐపీఎస్ ప్రారంభించారు.
యువత, విద్యార్థుల్లో డిజిటల్ భద్రతపై అవగాహన పెంపొందించేందుకు 6 వారాల పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని విద్యార్థులతో సైబర్ భద్రత ప్రతిజ్ఞ చేయించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... డిజిటల్ ప్రపంచంలో మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. అవగాహనే ఆయుధం. ప్రతిజ్ఞ చేసిన ప్రతి విద్యార్థి తనతో పాటు తన కుటుంబాన్ని కూడా రక్షించే సైబర్ వారియర్ అవ్వాలని ప్రేరణాత్మకంగా అన్నారు.
కళాశాల విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి, సైబర్ నేరాల పెరుగుతున్న మార్పులు, వ్యూహాలు, వాటి నివారణ చర్యలపై వివరించారు. ప్రతి ఒక్కరూ సైబర్ ప్రపంచంలో ఒక జాగ్రత్తపడ్డ పౌరుడుగా ఎదగాలని, ఎవరికైనా మోసం జరిగితే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్ కు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. డిజిటల్ మోసాలు, బ్లాక్ మెయిలింగ్, డీప్‌ఫేక్‌లు, నకిలీ యాప్‌లు, చిన్నారుల సైబర్ రక్షణ వంటి అంశాలపై రాష్ట్రంలోని పౌరులందరికీ ప్రత్యేక మార్గదర్శకాలు అందిస్తారు. ప్రతి పోలీ స్టేషన్ వారానికొక కార్యక్రమం నిర్వహించాలి. టీజీసిఎస్ బి అందించే పోస్టర్లు, ఆడియో/వీడియో క్లిప్లు ప్రజాస్థలాల్లో ప్రదర్శించబడతాయని 6 వారాల ప్రచార కార్యక్రమం ప్రతి వారం ఒక ప్రత్యేక థీమ్ ఆధారంగా సైబర్ నేరాల విధానాలు, వాటి నివారణ చర్యలు, విద్యార్థులు ప్రజలలో సురక్షిత డిజిటల్ అలవాట్లను పెంపొందించేందుకు పోలీససుశాఖ సమగ్ర అవగాహన కార్యక్రమాలు చేపడతామని ఈ అవగాహనలో పోలీస్టేషన్లు, పాఠశాలలు, కళాశాలలు, రవాణా కేంద్రాలు, ప్రజా స్థలాలు అన్నీ భాగస్వామ్యమవుతాయని ఎస్పీ తెలిపారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ ఎస్పీ విద్యార్థులను డిజిటల్ భద్రతపై నిబద్ధతగా నిలబడేలా ప్రత్యేకమైన “సైబర్ భద్రత ప్రతిజ్ఞ” చేయించారు.
గోడపత్రికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పీ, వెంకటేశ్వరరావు, డిసిఆర్బి డీఎస్పీ, బాలాజీ నాయక్, వనపర్తి సిఐ, కృష్ణయ్య, కొత్తకోట సిఐ, రాంబాబు, ఆత్మకూరు సిఐ, శివకుమార్, ఇన్స్పెక్టర్లు, అప్పల నాయుడు, శ్రీనివాస్, సైబర్ క్రైమ్ ఎస్సై, రవి ప్రకాష్, సైబర్ క్రైమ్ పోలీసు సిబ్బంది, ప్రభుత్వ వైద్యకళాశాల, పాలిటెక్నీక్ కళాశాల, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మరియ బాలుర జూనియర్ కళాశాల, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.