calender_icon.png 15 May, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానుకోట జిల్లాకు చేరిన 2,21,880 పాఠ్యపుస్తకాలు

14-05-2025 11:21:35 PM

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాకు 2,22,880 పాఠ్యపుస్తకాలు చేరినట్లు జిల్లా టెస్ట్ బుక్స్ మేనేజర్ చీకటి వెంకట్రాం నరసయ్య తెలిపారు. కేసముద్రం పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటుచేసిన టెస్ట్ బుక్స్ సెంటర్ కు జిల్లావ్యాప్తంగా పంపిణీ చేయడానికి 3,19,660 పాఠ్యపుస్తకాలు అవసరం ఉండగా ఇప్పటివరకు ప్రభుత్వం 2,22,880 పాఠ్య పుస్తకాలు వచ్చాయని, ఇంకా 97,780 పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉందని చెప్పారు. బుధవారం విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి, జిల్లా విద్యాధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి పాఠ్యపుస్తకాల పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. ఈనెల 20 నుండి మండలాల వారిగా పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.