calender_icon.png 15 May, 2025 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం తడిసే..!

15-05-2025 12:00:00 AM

  1. కల్లాలలోనే ధాన్యపురాశులు 
  2. అకాల వర్షం.. రైతన్నకు శాపం 
  3. ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతల వేడుకోలు 
  4. మరో మూడు రోజులపాటు వర్షాలు పడతాయని వాతావరణం శాఖ హెచ్చరిక 
  5. కొనుగోలు వేగవంతం చేయకపోతే తీవ్రంగా నష్టపోనున్న రైతులు 

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 14 (విజ యక్రాంతి): దేశానికి వెన్నుముకగా నిలిచే అన్నదాతకు కష్టకాలం వచ్చింది. ఎంతో కష్టపడి ఏసంగీలో ధాన్యం పంట పండించగా అకాల వర్షాలతో అన్నదాతకు కష్టకాలం మొదలైంది. జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పెంచికల్పేట్, దహే గాం, కౌటాల, చింతలమాలపల్లి మండలాల్లోని పలు ప్రాంతాల్లో దాన్యపు రాశులు వర్షపు నీటిలో మునిగాయి.

కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యం భారీ స్థాయిలో రావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 34 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టగా క్షేత్రస్థాయిలో ఇప్పటికీ పూర్తిగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

19 ఐకెపి కేంద్రాలు 15 సహకార కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి దాన్యం కొనుగోలు చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరి ధాన్యం వస్తున్న 25 కేంద్రాల వద్ద మాత్రమే కొనుగోలు చేపట్టారు.

రైతులకు ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పా టు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేసినప్పటికీ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేయకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఎంతో కష్టపడి పండించిన పంట ను కాపాడుకునేందుకు అన్నదాతలు అవస్థలు పడా ల్సిన పరిస్థితి నెలకొంది. 

లక్ష్యం చేరేనా....

జిల్లాలో 55 వేల  మెట్రిక్ టన్నుల వరకు వేసవి కాలం దిగుబడి వస్తుందని వ్యవసా య శాఖ అధికారులు  అంచనా వేశారు. కానీ జిల్లాలో పదివేల మెట్రిక్ టన్నులకుమించి రాదని పౌరసరఫరాల శాఖ అధికా రులు భావిస్తున్నారు. గత ఖరీఫ్ సీజన్‌లోనే పదివేల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. వర్షాకాలం సీజన్లోనే పూర్తిస్థాయిలో జిల్లా యంత్రాంగం ధాన్యం కొనుగోలు చేపట్టలేదని ఆరోపణలు ఉన్నా యి.

పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్న ప్రకారం పదివేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అయినా ఈ సీజన్లో కొనుగోలు చేస్తారా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. జిల్లాలో దాదాపుగా కొనుగోలు ప్రారంభిం చి 20 రోజులు అవుతున్న కనీసం 1120  టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం గమనార్హం.ఇటీవల కురిసిన వర్షాలతో కేవలం పెంచికల్పేట్ మండలంలోని సుమారు 200 మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం తడిసినట్లు సమాచారం.

కొనుగోలు కేంద్రాల వద్ద వసతులు కల్పించాం

జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తలఎత్తకుండా ఏర్పాటు చేయడం జరిగింది. వర్షాలు పడితే ధాన్యం తడకుండా ఇప్పటికే తార్పాల్ అందించడం జరిగింది. రైతులు వెంట వెంటనే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి విక్రయించాల్సిందిగా కోరుతున్నాం.రైతులు కొనుగోలు కేం ద్రాలను సద్వినియోగం చేసుకోవాలి.

 నర్సింగరావు. డీఎం