22-10-2025 12:00:00 AM
పటాన్ చెరు, అక్టోబర్ 21 : ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి దీపావళి పండుగను అనాథ పిల్లలతో చైర్మన్ పృథ్వీరాజ్ జరుపుకుంటున్నారు. ఈసారి కూడా బొల్లారంలోని డిజైర్ సొసైటీలో ఉంటున్న అనాధ చిన్నారులకు టపాకాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్ మాట్లాడుతూ చిన్నారుల చిరునవ్వు చూడాలనే ఉద్దేశ్యంతోనే దీపావళి పండగను జరుపుకుంటున్నామని తెలిపారు.