29-07-2025 04:10:43 PM
డీజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి శ్రీనివాస్
తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఆగస్టు 10న పెద్దపల్లిలో జరిగే డీజేఎఫ్ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని డీజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్సై క్రాంతి కుమార్, డిసిసిబి డైరెక్టర్ సహకార సొసైటీ చైర్మన్ గుడిపాటి సైదులు, ప్రభుత్వ దవాఖాన సూపర్డెంట్ డాక్టర్ నిర్మల్ కుమార్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ, ఎటువంటి జీతభత్యాలు లేకుండా పనిచేస్తున్న జర్నలిస్టుల హక్కులకు ప్రభుత్వం ఆమోదం తెలపాలని వారు కోరారు.