23-12-2025 07:44:59 PM
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలలో భాగంగా 4 రోజైన మంగళవారం నాడు నరసింహ అవతారంలో భక్తులకు భద్రాద్రి రామయ్య దర్శనమిచ్చారు. ప్రధాన ఆలయం నుండి స్వామివారిని ఊరేగింపుగా మిథుల స్టేడియం తీసుకుని వచ్చి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై ఆసీనులు చేశారు. ఈ సందర్భంగా హాజరైన వేలాది మంది భక్తులు స్వామివారి ని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం స్వామివారిని తిరువీధి సేవకు తీసుకొని వెళ్లారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో తో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.