calender_icon.png 30 July, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యకు ప్రాధాన్యం కల్పిస్తున్నాం: జీఎస్సార్

29-07-2025 04:14:39 PM

చిట్యాల,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని, రానున్న రోజులలో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం చిట్యాల మండలంలోని శాంతినగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గతంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనతికాలంలోనే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. అనంతరం  విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయిస్తూ ఉపాధ్యాయుడిలా మారి సందడి చేశారు. పలకలు, నోటు బుక్స్, పెన్సిల్స్, బలపాలు, చాక్లెట్స్ అందజేశారు.