13-08-2025 08:23:38 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని భీమిని, బెల్లంపల్లిలోని గురజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి హరీష్ రాజ్(District Medical Health Officer Harish Raj) ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంట డాక్టర్ సుధాకర్ నాయక్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈ ప్రసాద్ ప్రోగ్రాం ఆఫీసర్ వైద్య సిబ్బంది ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి హరీష్ రాజ్ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని వైద్యులు వైద్య సిబ్బంది అప్రమత్తతో ఉండాలని గర్భవతుల వివరములు ఈ ఐదు రోజులలో ఈడిడి ఉన్న గర్భవతుల వివరములను ఉంచుకోవాలని వారితో సమీక్ష చేసుకొని ప్రసవమయ్యే ఆసుపత్రి దగ్గరలో ఉండే సదుపాయం కల్పించాలని ఆదేశించారు.
అదేవిధంగా వర్షాలు ఉండడం వలన జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు కావడం జరుగుతుందన్నారు.వైద్య సిబ్బంది అప్రమత్తతో ఉండి గ్రామాలలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని గ్రామ పంచాయతీ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని ఆదేశించినారు 108 102 ఆర్ బి ఎస్ కే వాహనాలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించినారు ప్రజలలో అవగాహన కలిగించాలని, బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్మిని అధికారికి ఆదేశించినారు