calender_icon.png 13 August, 2025 | 9:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేద్దాం: ఎంపీ ఈటల రాజేందర్

13-08-2025 08:21:41 PM

కొర్రెముల నుంచి నారపల్లి వరకు తిరంగా ర్యాలీ..

ఘట్ కేసర్: బిజెపి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ అధ్యక్షతన బుధవారం పోచారం మున్సిపల్ పరిధిలోని కొర్రెముల నుంచి నారపల్లి వరకు నిర్వహించిన తిరంగా ర్యాలీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్(MP Etela Rajender) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆపరేషన్ సింధూర్ విజయానికి చిహ్నంగా మన దేశ సైనికుల పరాక్రమంపై గర్వంతో ప్రతి ఒక్కరూ మన ఇండ్లపై జాతీయ పతాకాన్ని ఇగురవేసి మన దేశభక్తిని చాటి చెప్పే విధంగా ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ  మాజీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మండల మరియు మున్సిపల్ అధ్యక్షులు బస్వ  రాజుగౌడ్, ఏర్పుల మహేష్, రాంపల్లి గిరి గౌడ్, సురేష్ నాయక్, కొమ్మిడి మహిపాల్ రెడ్డి, జాతీయ నాయకులు బిక్కు నాథ్ నాయక్, రాష్ట్ర ఓబీసీ నాయకులు కాలేరు రామోజీ, అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, కన్వీనర్ గాలి సంపత్  మహిళామోర్చ నాయకురాళ్లు, రాష్ట్ర,  జిల్లా, మండల నాయకులు, స్థానిక నాయకులు, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.