భక్తులకు ఇబ్బందులు తలెత్తనీయొద్దు
- అందుకు తగ్గ చర్యలు చేపట్టాలి
- దేవాదాయ కమిషనర్ హనుమంతరావు
- అభివృద్ధి పనులపై సమీక్ష.. డిజిటల్ రసీదు విధానం ప్రారంభం
వేములవాడ, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ లోని శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ భీమేశ్వర స్వామి ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండోమెంట్ అడ్వైజర్ గోవింద హరి, క్షేత్ర ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి పాల్గొన్నారు. ఆలయ ఈఓ రమాదేవి పూల మొక్క అందజేసి కమిషనర్‌కు ఘన స్వాగతం పలికారు. అనం తరం కమిషనర్ ఆలయ అభివృద్ధి పనులను సమీక్షించారు. క్యూలైన్లు, శానిటేషన్, లడ్డూ తయారీ కేంద్రం, ఈ-టికెటింగ్ సేవలను పరిశీలించి, వేసవిలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
గోశాలలో పశుగ్రాసం నాణ్యతను స్వయం గా పరిశీలించి, కోడెల సంరక్షణలో నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులకు ఆదేశించారు. బయోగ్యాస్ ఉత్పత్తి అంశంపై కూడా వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా దేవస్థానం ఉద్యోగులు కమిషనర్‌ను శాలువాతో సన్మానించి, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.అదేవిధంగా భక్తులకు పారదర్శక సేవలు అందించే దిశగా దేవస్థానంలో డిజిటల్ రసీదు విధానాన్ని కమిషనర్ ప్రారంభించారు.భక్తులు సమర్పించే బంగా రం, వెండి వంటి విలువైన వస్తువులకు పూర్తి వివరాలతో రసీదులు జారీ చేయబడనున్నాయి.ఈ విధానం ద్వారా సమర్పణల ట్రాకింగ్, ధృవీకరణ సులభతరం అవుతుందని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమం లో ఆలయ ఈఓ రమాదేవి ఆలయ సిబ్బం ది, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.






