10 March, 2026 | 9:17 PM

రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు

28-10-2024 12:04 AM

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు

మెదక్, అక్టోబర్ 27(విజయక్రాంతి): మెదక్ నియోజకవర్గంలో రైతులకు ఎలాం టి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు సూచించారు. ఆదివారం ఆయన మెదక్‌ని దాయర, మగ్దూంపూర్‌లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని తెలిపారు. అధికారులు రైతులకు సకాలంలో కొనుగోళ్లు చేపట్టి వారి ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. నాయకులు శంకర్, బొజ్జ పవన్, దాయర రవి, లింగం తదితరులు పాల్గొన్నారు.