08-01-2026 01:43:29 AM
శ్రీకాంత్ రెడ్డిని అభినందిస్తున్న ప్రజలు ప్రజాప్రతినిధులు
తూప్రాన్, జనవరి 7: కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆలోచన కార్యరూపం దాల్చడంతో పలు గ్రామాలకు రోడ్డు మార్గం సులభతరమైంది. కబ్జాకు గురైన రోడ్డును అధికారుల, నాయకుల సహకారంతో రోడ్డుకు హద్దులు ఏర్పాటు చేయడంతో పాటు ఆ రోడ్డున నడిచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసిన శ్రీకాంత్ రెడ్డిని ఆయా గ్రామాల ప్రజలు అభినందిస్తున్నారు. తూప్రాన్, శివంపేట మండలాల సరి హద్దులోని గుండ్లపల్లి, నర్సాపురం పల్లె నుండి వెంకటాపూర్ పిటి మధ్యగల రోడ్డు కొంతకాలంగా కబ్జాకు గురైంది.
ప్రజలు నడిచేందుకు సౌకర్యంగా లేకపోవడం నక్షకు ఉండాల్సిన రోడ్డు లేకపోవడం గమనించిన మున్సిపల్ పరిధిలోని వెంకటాపూర్ గ్రామ కాం గ్రెస్ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి అధికారులను, నాయకులను సందర్శించి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. కబ్జాకు గురైన రోడ్డుకు హద్దులు ఏర్పాటు చేసి చదును చే యడంతో ఆ రోడ్డు వెంట విద్యార్థులు పాఠశాలకు వెళ్లడం ప్రజలకు సంతోషాన్ని కలిగించింది. దాంతో రోడ్డు ఏర్పాటుకు కృషి చేసిన శ్రీకాంత్‌రెడ్డిని ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందిస్తున్నారు.