17-09-2025 12:05:46 AM
సింగరేణి ఏరియా జీఎం రామ చందర్
మణుగూరు, సెప్టెంబర్ 16 ( విజ యక్రాంతి) : కోలిండియా క్రీడల్లో సింగరేణి క్రీడాకారులు సత్తా చాటాలని ఏరియా జీఎం దుర్గం రామచందర్ సూచించారు. మంగళవారం భద్రాద్రి స్టేడియంలో ఉద్యోగుల క్రీడ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడా రు. క్రీడాకారులు క్రమశిక్షణ, అంకితభావం తో నైపుణ్యత ప్రదర్శిస్తారనే పేరుందని, అదే స్ఫూర్తితో కోల్ ఇండియా స్థాయి క్రీడాల్లో రాణించాలన్నారు.
కార్యక్రమంలో డిజిఎం(పర్సనల్) సలగట్ల రమేశ్, ఏఐటియూసి బ్రాం చ్ సెక్రటరీ రాంగోపాల్, ఐఎన్ టి యూసి వైస్ ప్రెసిడెంట్ కృష్ణంరాజు, సిఎంఓఏఐ జనరల్ సెక్ర టరీ మధన్ నాయక్ , డిజిఎం(సి విల్) శివప్రసాద్, సీనియర్‌పర్సనల్ అధికారి నరేశ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ అస్సిస్టెంట్ స్పొరట్స్ సూపర్వైజర్ జాన్వెస్లీ, సిహె చ్. వేంకటేశ్వరరావు ఉద్యోగ క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.