calender_icon.png 1 May, 2025 | 6:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు

01-05-2025 12:19:53 AM

నిర్మల్ ఏప్రిల్ 30 (విజయక్రాంతి): జిల్లా లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా యువకులు చిన్న పిల్లలే మరణిస్తున్నారని తల్లిదండ్రులు వాహనాలను పట్టణంలో మైనర్లకు  ఇవ్వవద్దని బైంసా ఎస్పీ అవినాష్ కుమార్ నారిశక్తి పోలీసులు ఆయా గ్రామాల్లో బుధవారం విస్తృతంగా అవగాహన కల్పించారు.

జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు నారి శక్తి లో భాగంగా ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు నేరాల నియంత్రణ, షీ టీం నిర్వహణ, సైబర్ నేరాలు, చైన్ దొంగతనాలు తదితర అంశాలపై అవగాహన కల్పిం చి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా పోలీస్ స్టేషన్లో ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.