calender_icon.png 1 May, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి

01-05-2025 12:21:53 AM

మునగాల, ఏప్రిల్ 30: సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని నారాయణగూడెం  గ్రామానికి చెందిన గడ్డం కోటిలింగం తండ్రి లచ్చయ్య  పూరి గుడిసెలో ఉంటూ జీవనం సాగిస్తున్నాను 2017లో కరెంటు షార్ట్ సర్క్యూట్ లో ఇల్లు పూర్తిగా దగ్ధమై  ఈ ఇప్పటికీ ఈ పూరి గుడిలో నివసిస్తున్నాను. నేను ఈ ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇల్లుకి దరఖాస్తు పెట్టాను నా భార్య పేరు రాలేదు. నా పెద్ద కుమారుడైన గడ్డం లక్ష్మీనారాయణ అతని భార్య పేరు గీత  ఇందిరమ్మ ఇళ్లల్లో లిస్ట్  లో ఉన్నది అయినా కానీ నారాయణగూడెం లో ఇందిరమ్మ ఇళ్లల్లో 16 పేర్లు సర్వే చేసినారు అవీ సెలెక్ట్ చేసినారు ఆ పేర్లలో నా పెద్ద కుమారుడు పేరు కూడా లేదు  

నేను ప్రస్తుతం కూడా పూరి గుడిసె లో నివసిస్తున్నాను మా చిన్న కొడుకు నా దగ్గరే ఉంటున్నాడు మాకు ఎలాంటి రాజకీయాలు లేవు నా భార్య నేను నా చిన్న కొడుకు ప్రతిరోజు కూలి పనికి వెళ్తాము ఈ పూరి గుడిసె కి తాటీ ఆకులు కొట్టుకొని వచ్చి ఈ గుడిసె కప్పుకుంటున్నాము   కావున మా యందు దయవుంచి మాకు  ఇల్లు మంజూరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.