calender_icon.png 7 May, 2025 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడే స్ఫూర్తితో కార్మికుల సమస్యలపై పోరాడుదాం

06-05-2025 12:00:00 AM

సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్

కామారెడ్డి, మే 5 (విజయ క్రాంతి ) : మేడే సందర్భంగా కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో  మేడే జెండా  ఆవిష్కరించారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ కార్మికులను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో కార్మికుల సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు.

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.  కార్మికులకు ఉద్యోగ భద్రత లేదని కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను రద్దుచేసి కొత్త 4 లేబర్ కోడ్ లను తీసుకురావడం కార్మిక ద్రోహం అని అన్నారు. వీటికి నిరసనగా మే 20న దేశవ్యాప్త సర్వత్రిక సమ్మెలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. 

దేశంలో 47 కోట్ల మంది శ్రమజీవులలో కేవలం ఏడు కోట్ల మంది కార్మికులకు మాత్రమే ఉద్యోగ భద్రత తగిన వేతనాలతో జీవిస్తున్నారని మిగతావారు బతుకు భద్రత లేక కొట్టుమిట్టాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కోర్టుల గురించి గొప్పలు వల్లించే కేంద్ర ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం అనే సుప్రీంకోర్టు తీర్పును ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చివరికి కార్మికులు జీవించడానికి సరిపడే వేతనాలు ఇవ్వాలని పోరాడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలలో బిజెపి కేంద్ర ప్రభుత్వం 15 చట్టాలను అడ్రస్ లేకుండా చేస్తూ మిగతా 29 చట్టాలను నాలుగు లేబర్ కోట్స్ ఆమోదించి అమలు చేయడం వల్ల కార్మికులు యజమానులకు కట్టు బానిసలుగా మారుతారని అన్నారు.  వేతనాల గురించి బేరసరాలు లేకుండా చేయడం అధిక పనిగంటలు, నియమిత కాలపరిమితి గల ఎంప్లాయ్మెంట్ ఉండే విధంగా నిబంధనలు పరిశ్రమల మూసివేత కార్మికుల తొలగింపునకు సులభ తర అవకాశాలను కోర్సులో పొందుపరచాలని అన్నారు.

ఇది పూర్తిగా కార్మికుల హక్కులను హరించడమే అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అసంకటిత కార్మిక వర్గానికి ఏ విధమైన సామాజిక భద్రత లేదని అన్నారు. కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ స్కీం వర్కర్లు కార్మికులరైజేషన్ చేసి ప్రభుత్వమే కార్మికుల రిక్రూట్మెంట్ చేసుకోవాలని, ఏజెన్సీ వ్యవస్థలను రద్దు చేయాలని సమాన పనికి సమాన వేతనం ఉద్యోగ భద్రతకై జీవించడానికి సరిపడే వేతనాలు పెన్షన్ పెంపు కార్మిక వ్యతిరేక లేబర్ కోర్సు అమలు నిలుపుదల కోసం మే డేస్ పూర్తిగా మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని, హక్కుల కోసం పోరాటానికి సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు అరుణ్, సిఐటియు నాయకులు రాజ నర్సు,  ప్రభాకర్, మహబూబ్, సంతోష్, ప్రవీణ్, ప్రభు, దీవెన, శివ, రాజవ్వ, సువర్ణ, సాయవ్వ, రాజమణి తదితరులు పాల్గొన్నారు.