calender_icon.png 31 October, 2025 | 2:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాక్లూర్ ప్రభుత్వ పాఠశాల భవనం ప్రారంభోత్సవం

28-10-2025 12:00:00 AM

బీగాల గంగారం జ్ఞాపకార్థం మనుమడు బిగల గణేష్ గుప్తా రూ. కోటి విరాళం 

నిజామాబాద్, అక్టోబర్ 27 (విజయ క్రాంతి): నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా  తండ్రి బిగాల కృష్ణమూర్తి, తాత బిగాల గంగారం జ్ఞాపకార్థం కోటి రూపాయల సొంత నిధులు, పాఠశాల భవన నిర్మాణానికి అభివృద్ధికై ఇచ్చారు. విద్యాశాఖ ఈ నిధులు రూ.5.70 కోట్లతో నిర్మించిన పాఠశాలలను సోమవారం ప్రారంభించారు. రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి  ప్రారంభోత్సవం చేశారు.

ఈ భవనాలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనానికి బిగాల కృష్ణమూర్తి, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనానికి బిగాల గంగారం అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి బిగాల గణేశ్ గుప్తా, బిగాల మహేశ్ గుప్తా సోదరులను అభినందించారు. కార్యక్రమంలో నిజామాబాద్ మాజీ మేయర్ నీతూకిరణ్, మాజీ జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు పైడి రాకేశ్ రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్ ఆర్మూర్,మాక్లూర్ మండల కేంద్రంలో సోమవారం జడ్పీహెచ్‌ఎస్, ఎం పీపీ ఎస్ పాఠశాలలకు సంబంధించి నూతన సముదాయాలను  ప్రారంభించారు.