06-09-2025 12:39:06 AM
-భార్య శోభతో కలిసి ఎర్రవల్లిలో గణపతి హోమం
-పాల్గొన్న కేటీఆర్, మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్ నేతలు పలువురు
-ప్రతిఏటా గణపతి నవరాత్రుల్లో కేసీఆర్ ప్రత్యేక పూజలు
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) : సిద్దిపేట జిల్లాలోనిఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్ గణపతి హోమం నిర్వహించారు. విఘ్నాలు తొలగాలని తన సతీమణి శోభతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ క్రతువు సాయంత్రం 5.30 గంటలకు ముగిసింది. హోమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు హాజరయ్యారని సమాచారం.
గత ఐదు రోజులుగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే ఉన్నారు.బీఆర్‌ఎస్ పార్టీకి రాజకీయ ప్రతికూల వాతావరణం, కాళేశ్వరం విచారణ, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ, ఫోన్ ట్యాపింగ్ కేసుల కారణంగా పండితుల సూచన మేరకు కేసీఆర్ గణపతి హోమం నిర్వహించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ వినిపిస్తుంది. వాస్తవానికి ఆగస్టు 6వ తేదీన ఫామ్‌హౌస్‌లో చండీ యాగం నిర్వహించాల్సి ఉండగా కేసీఆర్ అనారోగ్యం కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.
ప్రతి ఏటా వినాయక చవితి నవరాత్రుల్లో కేసీఆర్ పూజలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్‌కు దైవభక్తి ఎక్కువనే విషయం తెలిసిందే.. హోమాలపై ఆయనకు ఎంతో నమ్మకం. ఇప్పటికే ఆయన పలు రకాల హోమాలను నిర్వహించారు. ఇప్పు డు కూడా గణపతి హోమం చేపట్టారు.