calender_icon.png 6 July, 2025 | 10:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీపై పేటెంట్ మీకేనా.. మాకొద్దా!

06-07-2025 01:11:34 AM

మీరు టికెట్ల కోసం ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు..పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి ఇంటికే టికెట్లు వస్తాయని కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరీలో సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే సీఎం అయ్యాక ఆయన మాత్రం ఢిల్లీ చుట్టూ చక్కర్లు వేస్తున్నారు. రేవంత్ ఢిల్లీకి ఇన్నోసారి..అన్నో సారి అంటూ ఆ పార్టీ నేతలే లెక్కలు వేస్తున్నారు.

ఇప్పటికే 47 సార్లు ఢిల్లీకి సీఎం వెళ్లివచ్చారని త్వరలోనే హాఫ్ సెంచరీ కూడా పూర్తవుతుందని పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. తాను మాత్రం అధిష్ఠానాన్ని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లొచ్చు.. కానీ తాము వెళ్లొద్దా అని కొందరు నేతలు నారాజ్ అవుతున్నారు. ఢిల్లీపై ఆయనకు మాత్రమే పేటెంట్ ఉందా అని గుసగుసలాడుతున్నారు.     

 విజయభాస్కర్