27-04-2025 12:00:00 AM
బ్లాక్ సాల్ట్‌ను ప్రతి ఇంట్లో వివిధ ఆహారపదార్థాలు, పలు రకాల జ్యూస్‌ల్లో ఉపయోగిస్తారు. ఇందులో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ ఉప్పు ఆహారం రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడే ఈ నల్ల ఉప్పు చాలా బాగా పనిచేస్తుంది.
నల్ల ఉప్పు ఎసిడిటీ నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. తరచుగా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను నిరోధించడంలో నల్ల ఉప్పు బాగా పనిచేస్తుంది. నల్ల ఉప్పు కాలేయ ఆరోగ్యానికి కూడా మంచిదని కొన్ని అధ్యయనాల్లో కూడా తేలింది.
అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు చిటికెడు నల్ల ఉప్పు తింటే మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
చెడు కొలెస్ట్రాల్ సమస్యను తగ్గిస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలా అని ఎక్కువగా తీసుకున్నా హానికరం కాబట్టి పరిమితంగా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు వైద్యులు.
బరువు తగ్గడానికి ప్రభావ వంతంగా ఉంటుంది. నల్ల ఉప్పులో స్థూలకాయాన్ని నిరోధించే గుణాలు ఉన్నాయి. కాబట్టి ఆహారంలో సలాడ్, పానీయం వంటి మొదలైన వాటిల్లో నల్ల ఉప్పును వేసుకుంటే.. అధిక బరువును తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.