calender_icon.png 28 August, 2025 | 1:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోడ కూలి పల్లె దవాఖాన డాక్టర్ మృతి

28-08-2025 10:41:50 AM

కామారెడ్డి జిల్లా రాజంపేట 

కామారెడ్డి,(విజయక్రాంతి): భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా(kamareddy) రాజంపేట మండల కేంద్రంలో దేవుని చెరువు కట్ట తెగిపోవడంతో నీటి ప్రవాహానికి ఇంటి గోడ కూలి డాక్టర్ మృతి చెందారు. రాజంపేట మండలం గుండారం పల్లె దవాఖాన డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్(Doctor) వినయ్ కుమార్ (28)రాజంపేటలో గదిలో పడుకుని ఉండగా గోడకూలి బుధవారం మృతి చెందారు.

ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకొని అందరితో చనువుగా ఉండే యువ డాక్టర్ వినయ్ కుమార్(Young Dr. Vinay Kumar) మృతి చెందడం పట్ల గ్రామస్తులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. దేవుని చెరువు కట్ట తెగిపోవడంతో అకస్మాత్తుగా ఇంట్లోకి నీరు చేరుకొని గోడ కూలడంతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. అంత్యక్రియలు గురువారం జరగనున్నాయి. మృతుని అన్న తిరుపతి దేవస్థానానికి ప్రయాణం కి వెళ్లడంతో అంత్యక్రియలు గురువారం నిర్వహించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు.